ప్రజాశక్తి- తాడిపత్రి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలోని తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు వైసిపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ర్యాలీకి హాజరయ్యేందుకు తాడిపత్రికి వస్తున్న వైసిపి శ్రేణుల వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
తాడిపత్రిలో ఉద్రిక్తత.. పెద్దారెడ్డి ర్యాలీకి పోలీసుల అడ్డంకులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 09:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)