మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన

2 గంటల క్రితం

Home Minister Anita
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : అర్నబ్ తుఫాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో మంగళవారం హోం మంత్రి అనిత పర్యటించారు. రేవు పోలవరం, బోయపాడు తీర గ్రామాల్లో పునరావస కేంద్రాలను పరిశీలించారు. తుఫాను తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని మత్స్యకారులకు సూచించారు. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు, వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలోని స్థానికులతో మాట్లాడారు. తుఫాను తీరాన్ని దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుపాను తీరం దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలన్నారు. హోంమంత్రి వెంట ఆర్డీవో రామలక్ష్మి, తహసీల్దార్ రమేశ్‌ బాబు, పలువురు నాయకులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్