ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని కొత్తపల్లి ఎంపీటీసీ-2 స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థి జాలంవరలక్ష్మి ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు మంగళవారం ప్రకటించారు. ఆమె ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల అధికారి ఆమె విజయం సాధించినట్లు ధ్రువీకరిస్తూ ఎన్నికల పత్రాన్ని అందజేశారు. జ్యోతుల నెహ్రూ, ఎంపీపీ అభ్యర్థి జనపరెడ్డి హిమశైలు సుబ్బారావు నాయకత్వంలో ఈ విజయం సాధించినట్లు కూటమి నాయకులు తెలిపారు. మండలంలో కూటమికి తొలి విజయం దక్కడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఇదే స్ఫూర్తితో మిగిలిన 19 స్థానాల్లోనూ విజయం సాధించాలని కూటమి నాయకులు ఆకాంక్షించారు.
కొత్తపల్లిలోఎంపీటీసీ-2లో జనసేన పార్టీ అభ్యర్థి జాలం వరలక్ష్మి ఏకగ్రీవం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 05:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)