మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెముడులంకలో నవరాత్రి ముగింపు ఉత్సవాలు.. భారీ అన్నసమారాధన

1 గంట క్రితం

aalamuru-4
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 04:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : దసరా పండుగ వేడుకలలో దేవి నవరాత్రి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలోని చెముడులంకలో మంగళవారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం ఆవరణంలో సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నంల పర్యవేక్షణలో అమ్మవారి ఉత్సవ కమిటీ, గ్రామస్తుల సహకారంతో పిండి వంటలతో విందు భోజనాన్ని తలపించేలా ఈ అన్నసమారాధనను ఘనంగా ఏర్పాటు చేశారు. ఇందులో చెముడులంకతో పాటుగా పరిసర ప్రాంతాల నుంచి సుమారు ఎనిమిది వేల మంది వరకు విచ్చేసి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అయితే తుఫాను ప్రభావంతో అన్న సమారాధన చివరి దశలో చిన్నపాటి చిరుజల్లులు పడినప్పటికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహక కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్