మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కండ్రిగపేట స్కూల్ కు ఉపాధ్యాయుని కోసం వినతి

1 గంట క్రితం

aalamuru-3
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 04:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : మండల కేంద్రంలోని కండ్రికపేట ఎంపీపీ పాఠశాలలో ఇటీవల హఠాత్తుగా మృతిచెందిన ఉపాధ్యాయులు పిల్లి రాంబాబు స్థానంలో మరొక ఉపాధ్యాయుని కేటాయించాలి. ఈమేరకు ఎస్ఎంసి సభ్యులు గుత్తుల కిరణ్ మండల విద్యాశాఖ అధికారి బి.అప్పాజీకి మంగళవారం వినతి పత్రాన్ని అందించారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థులు సంఖ్య 33 ఉన్నదన్నారు. మండలంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అదనంగా ఉన్న పాఠశాలల నుండి ఒక ఉపాధ్యాయుని కండ్రికపేట పాఠశాలకు కేటాయించి తద్వారా విద్యార్థులకు తగు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఎంఈఓ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అద్దరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్