ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

26 సెప్టెంబర్, 2026

acident.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 08:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి–శింగరాయకొండ : ప్రకాశం జిల్లాలోని జాతీయ శింగరాయకొండ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోల్డెన్ కేఫ్ హోటల్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి అర్బన్‌లోని మంగళం ప్రాంతానికి చెందిన ఐదుగురు కారులో విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోల్డెన్ కేఫ్ హోటల్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో హరిప్రసాద్‌, విశాలాక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. లావణ్య, కాన్షితు, ప్రణశ్రీ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 జాతీయ రహదారి అంబులెన్స్‌ సిబ్బంది క్షతగాత్రులను తొలుత ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అదే సమయంలో ఒంగోలు వైపు వెళ్తున్న కందుకూరు సీఐ అన్వర్‌ భాష ప్రమాదాన్ని గమనించి ఆగి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు.

శింగరాయకొండ సీఐ వై.శ్రీహరి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కారు లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో లారీలో ఇరుక్కుపోయింది. దీంతో కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయడానికి అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించారు. కారు డోర్లను కట్ చేసి హరిప్రసాద్‌, విశాలాక్ష్మి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన లావణ్య, కాన్షితు, ప్రణశ్రీలను మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై సీఐ వై.శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్