హైదరాబాద్: గచ్చిబౌలిలో ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నియో పోలీస్ బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు, కనైయాలాల్ (25), దేరామ్ (24), అక్కడికక్కడే మృతి చెందారు. వీరు కొల్లూరు పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్‌లో నివసిస్తూ టైల్స్ పనులు చేసుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రామ్‌గూడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 08, 2026, 09:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)