శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏజెన్సీ బంద్‌కు గిరిజనుల మద్దతు.. ర్యాలీ, ధర్నా

1 గంట క్రితం

అనకాపల్లి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 09:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనకాపల్లి: ఏజెన్సీ బంద్‌కు మద్దతుగా అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో గిరిజనులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. బంగారుబందలు నుంచి కళ్యాణపులావ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జీవో నంబర్ 3ను అమలు చేయాలని, నాన్‌-షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే అనకాపల్లి జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీల్లో స్థానిక గిరిజన సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జెడ్‌ జోగంపేట గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాదంపాడు రెవెన్యూ పరిధిలో గతంలో గిరిజనులకు కేటాయించిన సీలింగ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి గిరిజనులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ భూముల పరిస్థితిపై జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలన చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఏజెన్సీ బంద్‌కు మద్దతుగా ర్యాలీ, ధర్నా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు, గేమిల వాసు, గలబరి రాజబాబు, పాంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్