ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పామిడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

3 గంటల క్రితం

acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 07:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బ్రిడ్జిపై నుంచి బస్సు, లారీ కిందకు.. 32 మందికి గాయాలు

ప్రజాశక్తి-పామిడి: అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామిడి మండలం పొగరూరు సమీపంలోని బ్రిడ్జి వద్ద హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఐచర్‌ లారీ అదుపుతప్పి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును లారీ ఢీకొట్టింది.ఈ ఘటనలో బస్సు, లారీ రెండూ బ్రిడ్జిపై నుంచి కిందకు పడిపోయాయి. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 32 మందికి గాయాలైనట్లు సమాచారం. వీరిలో బస్సు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పామిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్