- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తొలి హరిత హైడ్రోజన్ రైలు ప్రారంభం దేశ రవాణా రంగంలో చారిత్రాత్మక మైలురాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రవాణా వ్యవస్థ దిశగా దేశం కీలక ముందడుగు వేసిందని సామాజిక మాధ్యం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అత్యంత శక్తివంతమైన, పొడవైన బ్రాడ్‌గేజ్ హైడ్రోజన్ రైలు సెట్‌లలో ఒకటిగా ఇది దేశ ఇంజినీరింగ్ ప్రతిభ, స్వదేశీ ఆవిష్కరణలకు నిదర్శనమని తెలిపారు. హరిత హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలు వినియోగ సమయంలో నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుందని, పర్యావరణ పరిరక్షణతో పాటు సాంకేతిక అభివృద్ధి సాధ్యమేనని నిరూపిస్తోందన్నారు. గత దశాబ్దంలో రైల్వేలు రికార్డు స్థాయి విద్యుదీకరణ, వందే భారత్ రైళ్లు, ఆధునిక రైల్వే స్టేషన్లు, ప్రత్యేక సరకు రవాణా మార్గాలు, కవచ్ వంటి స్వదేశీ భద్రతా వ్యవస్థలతో పాటు ఇప్పుడు హైడ్రోజన్ ఆధారిత రవాణా దిశగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఈ విజయం స్ఫూర్తితో పాటు కార్యాచరణకు పిలుపు వంటిదన్నారు. స్వచ్ఛ ఇంధనం, సహజ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సుస్థిర సాంకేతికతలను ప్రోత్సహించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉందని తెలిపారు.








కామెంట్‌లు (0)