నేను నా సీఎం అభ్యర్థిని కాదు : విజయసాయిరెడ్డి
ప్రజాశక్తి-విజయవాడ:రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక ప్రకటన చేశారు.నేను స్థాపించబోయే పార్టీకి నేను సీఎం అభ్యర్థిని కాదన్నారు. నాది బాల్‌థాకరే లాంటి మెంటార్ పాత్ర మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలో టిడిపి,వైసిపి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. ఎన్నికల్లో టిడిపి, వైసిపి మధ్య యుద్ధం నడుస్తోందని, కొత్త పార్టీ అవసరం ఉందన్నారు. ఈ రెండూ కూడా ఫ్యాక్షన్ పార్టీలు అయిపోయాయని విమర్శించారు.దీని వల్ల రాష్ట్రం అభివృద్ధి కావడంలేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.








కామెంట్‌లు (0)