శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కెవిపిఎస్‌ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

28 జూన్, 2026

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 10:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) నాయకులపై బనాయించిన అక్రమ కేసును తక్షణం ఎత్తివేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్‌ ‌చేశారు. పాండువ్వ దళిత యువకుడు వీధి నవీన్ కుమార్‌ను వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆకివీడు సిఐ కాళీ చరణ్‌ను కాపాడుకునేందుకు పోలీసులు కుట్ర చేసి బాధితులు, వారికి మద్దతుగా నిలిచిన వారిపై అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీధి నవీన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన లాఠీ దెబ్బలు నవీన్ కుమార్ ఒంటిపై కనిపిస్తుంటే పోలీసు శాఖ నిద్ర నటిస్తుందని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కోరిన కెవిపిఎస్ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబుపై నవీన్ కుమార్ భార్య చేత అక్రమ కేసును పోలీసుల ప్రోద్బలంతోనే పెట్టించారని తెలిపారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునే పనిలో భాగంగానే పోలీసు శాఖ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. నవీన్ కుమార్ భార్య కూడా పోలీసులు కొట్టిన దెబ్బలు వలన తన భర్త చనిపోయినట్లు వాట్సాప్ స్టేటస్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని తెలిపారు. అనేక సాక్ష్యాలు ఉండగా పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ కేసును పక్కదారి పట్టించేలా కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి క్రాంతిబాబుపై కేసులు బనాయించడం సబబుకాదన్నారు. ప్రజా ఉద్యమాలను న్యాయవంతంగా బాధితులు తరఫున కెవిపిఎస్ పోరాడుతుందని చెప్పారు

‘చిన పాండ్రాక’ ఘటనపై సమగ్ర విచారణ

మెడికల్‌ అధికారికి ఫిర్యాదు చేసిందనే నెపంతో కృష్ణాజిల్లా, కృతివెన్ను మండలం చిన పాండ్రాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంపై వేదింపులకు పాల్పడటాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర కమిటీ త్రీవంగా ఖండించింది. మెడికల్ ఆఫీసర్ వేధింపులపై జిల్లా వైద్య శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన కారణంగా మహిళా ఎఎన్‌‌ఎంను రాత్రి విధుల సమయంలో అర్ధరాత్రి బయటకు పంపించి తలుపులు వేసి వేదించిన ఘటలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జరిగిన అన్యాయంపై ప్రశ్నించినందుకు విధులకు రాకుండా అడ్డుకోవడం, ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేయకుండా నిరోధించడం వంటి అంశాలపై అధికారులు వెంటనే స్పందించాలన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్