ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన అభ్యర్థులు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవి రమణ, జి రామన్న డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత తమ సమస్యలపై ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కని, వాటిని అణచివేయడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రి 9 గంటల సమయంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజా, రాజేష్, సూరిబాబుతోపాటు 20 మంది అభ్యర్థులు, శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌పై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన 11,639 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 1,669 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని, రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోకపోతే డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Print Editionఅక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి : డివైఎఫ్‌ఐ
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)