హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం శాసనసభ నుంచి బిఆర్ఎస్ పార్టీ సభ్యులను సెషన్ మొత్తంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు. శాసనసభ నుంచి హరీష్ రావు, కెటిఆర్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, వివేకానంద సస్పెండ్ అయ్యారు. మూడో రోజు సభ ప్రారంభమైన వెంటనే వియ్ వాంట్ జస్టిస్ అంటూ బిఆర్‌ఎస్ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుపడటంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు.
TG - అసెంబ్లీ నుండి బిఆర్ఎస్ సభ్యులు సస్పెండ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 10:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)