హైదరాబాద్: గోల్కొండలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అహింసతో స్వాతంత్య్రాన్ని సాధించిన ఘనత మహాత్మాగాంధీకి దక్కుతుందని అన్నారు. గత 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని చెప్పారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలదని చెప్పారు. స్వేచ్ఛ జీవన ఆధారం అని దానికి వెల కట్టలేమని మహాత్మా గాంధీ చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వేచ్చను అందించామని, విధ్వంసకరమైన పాలన నుండి వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నామన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీతో పాటు రైతుభరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91 శాతం అధికంగా ఉందన్నారు. మహిళా సాధికారతలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెప్పారు. రెండు విడతల్లో 5.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. ఉద్యోగ నియామకాలు, కులగణన, గిగ్ కార్మికుల సంక్షేమం, విద్య, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం వివరించారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 11:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)