మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంటర్‌జోన్ వాలీబాల్ విజేత ఎపి సెక్రటేరియట్

10 ఆగస్టు, 2026

sports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 09:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రన్నరప్ గా విజయవాడ గార్డ్స్

-ఉత్కంఠభరితంగా ఇంటర్‌జోన్ వాలీబాల్ టోర్నమెంట్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎపిఎస్ పిఎఫ్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌లో ఎపి సెక్రటేరియట్ జట్టు విజేతగా నిలిచింది. విజయవాడ గార్డ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం విజయవాడలోని ఎపిఎస్ పిఎఫ్ఎయిర్‌పోర్ట్ యూనిట్ ఆధ్వర్యంలో టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఎపిఎస్ పిఎఫ్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎయిర్‌పోర్ట్ యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్ కె రమేష్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. టోర్నమెంట్‌ను ముఖ్య అతిథిగా హాజరైన ఎపిఎస్ పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ బివి రామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందిలో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

టోర్నమెంట్‌లో ఎపి సెక్రటేరియట్, ఎపి హైకోర్టు, డాక్టర్ ఎన్‌ టిటిపిఎస్, విజయవాడ గార్డ్స్, ఎపిఎస్ పిఎఫ్ హెడ్‌క్వార్టర్స్ తదితర యూనిట్లకు చెందిన ఆరు జట్లు పాల్గొన్నాయి. పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. సుమారు 250 మంది క్రీడాకారులు, సిబ్బంది, సందర్శకులు హాజరై పోటీలను వీక్షించారు.ఈ కార్యక్రమంలో విజయవాడ జోన్ కమాండెంట్ ఎం శంకరరావు, విజయవాడ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కె లక్ష్మీకాంతరెడ్డి, ఎయిర్‌పోర్ట్ సిఎఎస్ఒ ధర్మేంద్రతో పాటు విజయవాడ జోన్‌లోని వివిధ ఎపిఎస్ పిఎఫ్ యూనిట్ల అసిస్టెంట్ కమాండెంట్లు పివిఎస్ఎన్ మల్లికార్జునరావు, కృష్ణమాచారి, హేమసుందర్, కుమార్, ఇన్‌స్పెక్టర్లు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.ఇంటర్‌జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో పాటు విజేత, రన్నరప్ జట్లకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎపిఎస్ పిఎఫ్ విజయవాడ జోన్ కమాండెంట్ ఎం శంకరరావు చేతుల మీదుగా ట్రోఫీలు, బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఎపిఎస్ పిఎఫ్ ఎయిర్‌పోర్ట్ యూనిట్ అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్