- పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: డిఎస్సి-2025లో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శాప్ ఎండి భరణితో కలిసి సచివాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన అభ్యర్ధులపై ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.కర్నూల్ జిల్లాలో ప్రభాకర్ గౌడ్ అంశంపై శాఖపరంగా కమిటీ నియమించి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. విచారణ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. బిసి కులానికి చెందిన వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగం పొందిన అంశం తమ పరిధిలోకి రాదని చెప్పారు. సర్టిఫికెట్ రెవెన్యూ శాఖ ఇచ్చిందని, ఆ శాఖనే వివరణ ఇవ్వాలని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఆటలు జరగకుండానే జరిగినట్లు నలుగురు అభ్యర్ధులు సర్టిఫికేట్లు సమర్పించారని, దీనిపై విచారణ ఎందుకు చేయలేదని విలేకరులు ప్రస్తావించారు. ఈ అంశంపై భరణి మాట్లాడుతూ 2013కు సంబంధించిన వివరాలు శాప్ వద్ద లేవన్నారు. ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదన్నారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన అభ్యర్ధుల వివరాలు, సర్టిఫికెట్లు పబ్లిక్ డౌమైన్‌లో పొందుపరిచామని తెలిపారు. ఇప్పటివరకు ఏవరూ ఫిర్యాదు చేయకపోవడంతో విచారణ చేయలేదన్నారు. ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో పరిశీలిస్తామని చెప్పారు. అన్సారియా మాట్లాడుతూ డిఎస్సిలో ఎంపికైన అభ్యర్ధులపై ఆరోపణలు ఉంటే తమ వద్దకు తీసుకురావాలని కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మోడల్ ప్రాథమిక పాఠశాలలో కొందరు ప్రవేశించి టీచర్‌ను బెరించారని, ఈ అంశాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు.







కామెంట్‌లు (0)