- బిసి సంక్షేమ శాఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బిసి భవన్‌లో గల ‘ఎపి స్టేట్ స్టడీ సర్కిల్’ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరానికి బిసి అభ్యర్థులకు అందించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని సంచాలకులు ఎ.మల్లికార్జున తెలిపారు. ఇందుకు సంబంధించి అర్హత గల ప్రముఖ శిక్షణా సంస్థల నుండి ఆన్‌లైన్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ ఈ నెల10న విడుదల కానుండగా, టెండర్ దాఖలుకు ఈనెల 17 ఆఖరి తేదీగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం అక్టోబర్ 1న నిర్వహిస్తామని, టెండర్ల పరిశీలన, ఖరారు అక్టోబర్ 5న జరుగుతాయని తెలిపారు. ఇతర వివరాలకు https://tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చునని బిసి సంక్షేమ శాఖ సంచాలకులు మల్లిఖార్జున తెలిపారు.







కామెంట్‌లు (0)