బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిశ్రమల ప్రోత్సాహకాలకు రూ.352.88 కోట్లు

54 నిమిషాల క్రితం

industry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 11:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధుల నుంచి రూ.352.88 కోట్లను పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం వినియోగించేందుకు పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్రైమాసిక నిధుల నియంత్రణ నిబంధనలను సడలిస్తూ.. ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. పరిశ్రమల శాఖ కమిషనర్‌ తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.277.88 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహకాలకు రూ.40. కోట్లు, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.25 కోట్లు, పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి పథకం కోసం రూ.10 కోట్లు చొప్పున వినియోగించనున్నారు. నిధుల వినియోగానికి సంబంధించి సంబంధిత పథకాల కింద నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్