బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్లు

1 గంట క్రితం

janardhan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 10:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గోదావరి పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఆర్ అండ్‌ ‌బి శాఖ రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం రూ. 300 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి వెల్లడించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడానికి, భక్తుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఈ నిధులను కేటాయించినట్లు మంత్రి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి తీర, పరిసర ప్రాంతాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పోలవరం, ఏలూరు జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జిల్లాల పరిధిలోని 78 రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మంజూరైన రూ. 300 కోట్ల నిధులతో ఈ 6 జిల్లాల వ్యాప్తంగా దాదాపు 431 కిలోమీటర్ల పొడవైన స్టేట్ హైవేలు, జిల్లా ప్రధాన రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్టేట్ హైవేల పనులకు సంబంధించి 275 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 41 రోడ్ల పనుల కోసం రూ. 185.75 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 155 కిలోమీటర్ల మేర గల 37 కీలక రహదారుల అభివృద్ధి కోసం రూ. 114.25 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్