సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వివేకా హత్య కేసు దర్యాప్తులో అవకతవకలు

08 ఆగస్టు, 2026

case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 10:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ సునీత, కుటుంబసభ్యులు

ప్రజాశక్తి - పులివెందుల టౌన్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో అవకతవకలు జరిగాయని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని వివేకా కుమార్తె వైఎస్ సునీత తెలిపారు. విచారణ సరిగా జరగకపోవడం వల్లే తాము పదే పదే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్ వివేకా 75 వ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ వివేకా ఇంటి సమీపంలో ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం విలేకరులతో సునీత మాట్లాడుతూ... వివేకా హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలైనా న్యాయం జరగలేదన్నారు. ఆరు నెలల్లో వచ్చిన కొన్ని తీర్పులు సంతృప్తికరంగా లేవన్నారు. కిరణ్ యాదవ్ ఒక మాట, ఆయన తల్లి మరొక మాట మాట్లాడుతున్నారని, పొంతన లేని సమాధానాలు చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్