- బ్యాంకు సంఘాలతో ఐబిఎ చర్చలు
న్యూఢిల్లీ : ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఆదివారం రాత్రి బ్యాంకు సంఘాలు, యూనియన్లతో ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్(ఐబిఎ) చర్చలు తరువాత సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. ‘సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి ఐబిఎ, యుఎఫ్‌బియుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం, మిగిలిన శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించే అంశంపై చర్చించడానికి ఐబిఎ, యుఎఫ్‌బియులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు’ యుఎఫ్‌బియు పేర్కొంది. ‘ఈ కమిటీ సాధ్యమయ్యే అన్ని ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుంది; సంబంధిత వర్గాలన్నిటితో చర్చిస్తుంది, సంబంధిత వర్గాలందరికీ, మరీ ముఖ్యంగా వినియోగదారులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని రూపొందిస్తుంది,’ అని ఆ ప్రకటనలో తెలియజేసింది. ఇతర డిమాండ్లపైనా చర్చించనున్నట్లు పేర్కొంది.







కామెంట్‌లు (0)