శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చెంగాళమ్మ సేవలో ఇస్రో జాయింట్ సెక్రటరీ

1 గంట క్రితం

issro
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 10:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట(చిత్తూరు) : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీహరికోట నుంచి శనివారం చేపట్టనున్న విక్రమ్-1 ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో జాయింట్ సెక్రటరీ డా.శంకరి మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. ఆలయ ఈఓ బి. ప్రసన్న లక్ష్మి ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శంకరి మురళికి ఆశీర్వచనాలు చేశారు. దేశ శాస్త్రీయ రంగంలో మరిన్ని విజయాలు సాధించేందుకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇస్రో అధికారులు ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్