సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసు అమరులకు జగన్‌ నివాళి

5 రోజుల క్రితం

jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 08:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. దీనిపై బుధవారం ఎక్స్‌‌లో పోస్ట్‌ ‌చేశారు. ప్రజల రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగాలను ఎప్పటికీ మరువలేమని, అమరవీరుల శౌర్యం, త్యాగాలు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి నిరంతరం స్ఫూర్తినివ్వాలని తెలిపారు. ప్రజలను రక్షించడంలో, శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు అత్యున్నత ప్రమాణాలను పాటించాలని తెలిపారు. నిజాయితీ, ధైర్యం, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలన్న స్ఫూర్తిని పోలీసు అమరవీరుల నుంచి పొందాలి అని జగన్‌ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్