మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటు వేయకుండా వెనుదిరిగిన జగన్‌

01 నవంబర్, 2026

jagan -1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 03:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పులివెందుల : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందులలో మాజీ సిఎం జగన్‌ ఆదివారం తన ఓటును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. ‘‘పులివెందులలో రీ పోలింగ్‌ నిర్వహిస్తే అప్పుడు ఓటు వేస్తాను. నేను కూడా ఓటు వేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు అవుతుంది. ఈ రోజు జరిగిన ఘటనపై కోర్టుకు వెళ్తాం. ఎపిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎన్నికల్లో సంస్కరణలు అవసరం అని ’’ అన్నారు. పులివెందులలోని 80 పోలింగ్ బూత్‌లలో దాదాపు 70 చోట్ల తమ పార్టీ ఏజెంట్లను టిడిపి శ్రేణులు లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని, భౌతిక దాడులకు దిగారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని మండిపడుతూ, పులివెందుల మున్సిపాలిటీలో ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్