అలహాబాద్ హైకోర్టు
న్యూఢిల్లీ : మహిళలు బురఖా ధరించడం ఇస్లాం మతంలో తప్పనిసరి సాంప్రదాయం కాదని అలహాబాద్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఠాగూర్ పబ్లిక్ స్కూలులో 11వ తరగతి చదువుతున్న విద్యార్ధిని తాను ఆరో తరగతి నుంచి తన స్కూలు యూనిఫారం తోపాటు బురఖా ధరిస్తున్నానని, ఇప్పుడు కూడా ధరించడానికి అనుమతించా లని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ నెల 21న జస్టిస్ జె.జె.మునీర్, జస్టిస్ ఇందర్‌జిత్ శుక్లాలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. స్కార్ఫ్ ధరించకపోవడం వల్ల ముస్లిం మహిళ విశ్వాసం దెబ్బతింటుందని చెప్పే వాస్తవిక లేదా చట్టపరమైన ఆధారాలేవీ లేవని కోర్టు పేర్కొంది. విద్యా సంస్థ క్రమశిక్షణ, నిర్దేశిత యూనిఫారానికే కట్టుబడి వుండాలన్న భావన వల్ల ఈ వివాదం తలెత్తింది తప్ప ఇదేమీ మత స్వేచ్ఛకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోవడం కాదని పేర్కొంది. ఇదే విషయమై గతంలో బాంబే, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన రూలింగ్స్‌పై అలహాబాద్ హైకోర్టు ఆధారపడింది.







కామెంట్‌లు (0)