వాషింగ్టన్ : ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న నాలుగు భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసే క్రమంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఆపరేషన్ లో భాగంగా ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. ఆంక్షల బారిన పడిన వాటిలో కస్టమ్స్ బ్రోకర్ సంస్థ పోర్టీజ్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పితో పాటు సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్, పిపి సాఫ్ట్‌టెక్, ప్రకృతిస్ ఇన్ఫ్రా ఇంపెక్స్ సంస్థలు ఉన్నాయి. పోర్టీజ్ పార్ట్‌నర్స్ సంస్థ ఇరాన్ నుంచి భారత్‌కు పలుమార్లు పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతికి సహకరించిందని, ఈ సంస్థతో పాటు దీని భాగస్వాములు ఇండ్రిస్మియా అష్రఫ్మియా షేక్, హరీశ్ రామచంద్ర రంగీలపై నిషేధం విధించినట్లు అమెరికా తెలిపింది. అలాగే సదాశివ ఓవర్సీస్ సంస్థ సుమారు 69 మిలియన్ డాలర్లు, పిపి సాఫ్ట్‌టెక్, ప్రకృతిస్ ఇన్ఫ్రా సంస్థలు చెరో 25 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు అమెరికా ఆరోపించింది. పిపి సాఫ్ట్‌టెక్ డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్‌పై కూడా ఆంక్షలు వర్తిస్తాయని, వీరందరూ భారతీయ పౌరులని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
Print Edition4 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 12:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)