మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం

1 గంట క్రితం

LOKA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 12:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హాజరైన సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం విజయవాడలోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ఎపి లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్‌ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. అనంతరం లోక్ భవన్‌లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు గవర్నర్, ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, వాసంశెట్టి సుభాష్‌, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, న్యాయశాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్