బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఇ–(మీ)సేవ’ ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి

1 గంట క్రితం

ciu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు

విజయవాడ: 2003 నుంచి ప్రభుత్వ అర్బన్ ‘ఇ– (మీ) సేవ’ కేంద్రాల్లో 18 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్యాయంగా ఉద్యోగాలు కోల్పోయిన 607 మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని ఏపీ ఈ – (మీ)సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ఆగస్టు 17, 18, 19, 20 తేదీల్లో ఈఎస్‌డీ రాష్ట్ర కార్యాలయం వద్ద అర్బన్ ఇ – (మీ)సేవ ఉద్యోగుల ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి. నాగేశ్వరరావు పాల్గొని మద్దతు తెలిపారు. 18 సంవత్సరాల పాటు ప్రభుత్వ అర్బన్ ఇ –సేవ కేంద్రాల్లో సేవలందించిన 607 మంది ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తిరిగి ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్