మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ పాలన

48 నిమిషాల క్రితం

SIDIRI APPALA-Raju
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 10:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యాన పచ్చి జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్‌‌సి కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ పోలీసుల ముందస్తు అనుమతితో శాప్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన తెలపడానికి వెళ్లిన వైసిపి నేతలు, కార్యకర్తలపై యువగళం రౌడీ మూకలు విచక్షణా రహితంగా దాడులకు తెగబడిందన్నారు. జంతర్ మంతర్‌లో దాడుల తర్వాతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, శాప్ ఆఫీసు వద్ద దాడులకు బాధ్యతగా మంత్రి లోకేష్ తప్పుకోవాల్సిందేనని వైసిపి ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. లోకేష్‌తో బహిరంగ చ‌ర్చ‌కు వైసిపి నాయకులు ఎప్పుడూ సిద్ధమేనని, పేర్ని నాని స‌హా ఎంతోమంది ఇప్ప‌టికే బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారని స‌వాళ్ల పేరుతో జ‌గ‌న్‌‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయడం తప్ప చర్చకు రావడం లేదని వైసిపి అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. డిఎస్‌‌సిలో వికలాంగుల‌కు హ‌క్కుగా ద‌క్కాల్సిన పోస్టుల‌ను కాజేశారని, దానిపై విన‌తిప‌త్రం ఇవ్వడానికే తాము శాప్ కార్యాల‌యానికి వెళ్లామని, న్యాయం చేయాలని కోరే హ‌క్కును కూడా ప్ర‌భుత్వం కాల‌రాస్తోందని వైసిపి వికలాంగుల విభాగం అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్