ప్రజాశక్తి-అమరావతి : ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి పోలీసులు తన కుమారుడు గాదె సాయికృష్ణను విజయవాడలోని కృష్ణలంకకు తీసుకొచ్చిన అనంతరం ఆచూకీ తెలియలేదని, అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించాలని కోరుతూ తల్లి గాదె విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. అనంతరం సాయికృష్ణ లాకప్ డెత్‌పై తీర్పును ధర్మాసనం రిజర్వు చేసింది. ఈ వ్యవహారంలో కింది కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీల్డ్ కవర్లో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ ఆలపాటి గిరిధర్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని హింసించి హత్య చేశారని, మృతదేహాన్ని దహనం చేశారని ఆరోపిస్తూ తల్లి సిబిఐ దర్యాప్తు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును సిట్‌కు అప్పగించినప్పటికీ, అందులో రాష్ట్ర పోలీసులే ఉండటంతో నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదని ఆమె తరపున న్యాయవాది వాదించారు. అసాధారణ కేసుల్లో సిబిఐ దర్యాప్తునకు న్యాయస్థానాలు ఆదేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదిస్తూ, దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేశామని, నిందితులందరినీ అరెస్టు చేశామని తెలిపారు. కస్టడీ హింస వల్లే సాయికృష్ణ మృతి చెందినట్లు నిందితుడు సురేష్ వాంగ్మూలం ఇచ్చాడని, మృతదేహాన్ని దహనం చేసినట్లు కూడా చెప్పాడని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
Print Editionసాయికృష్ణ లాకప్ డెత్‌పై తీర్పు రిజర్వు
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)