మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition ఓటర్ల జాబితా పనుల్లో పెండింగ్‌ తగ్గించాలి

39 నిమిషాల క్రితం

vivek-yadav.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిఇఒ వివేక్‌ యాదవ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)‌లో ఫొటో క్వాలిటీ చెక్‌ తదితర పనుల్లో పెండింగ్‌ను త్వరితగతిన తగ్గించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) వివేక్‌ యాదవ్‌ తెలిపారు. జిల్లాల వారీ పెండింగ్‌ వివరాలను మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్లలో 3.65 కోట్ల మంది ఫొటోలను బిఎల్‌ఒలు ఆమోదించారని, ఇంకా 5.5 లక్షల మంది (1.50 శాతం) పెండింగ్‌లో ఉన్నారని తెలిపారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారంలోనూ పెండింగ్‌ను తగ్గించాలని ఆదేశించారు. ఫారం-6కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇందులో నెల్లూరులో 17,742, వైఎస్‌ఆర్ కడపలో 16,961, తిరుపతిలో 14,519, ప్రకాశంలో 14,449, మార్కాపురంలో 10,902 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఫారం-7కు సంబంధించి 11,135 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్