ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణంపై కంకణాలపల్లి గ్రామస్తుల నిరసన

8 గంటల క్రితం

b0eae372-eb57-4214-bf83-16cd911084ff.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌: రైల్వే అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జిని నేరుగా నిర్మించకుండా యూ ఆకారంలో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామస్తులు ఆదివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి రైల్వే గేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం రైల్వే అధికారులు తవ్విన గుంటలో నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. యూ ఆకారంలో కాకుండా నేరుగా అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. మహిళలు, చిన్నారులు సైతం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. తమ డిమాండ్‌ను అధికారులు పరిగణనలోకి తీసుకుని నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్