ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

లేబర్ కోడ్స్‌తో కార్మిక హక్కులకు తీవ్ర నష్టం

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రభుత్వరంగ సంస్థల సమన్వయ కమిటీ

- వర్క్‌‌షాపులో సిఐటియు అఖిల భారత కార్యదర్శి కరుమలైయన్

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని సిఐటియు అఖిల భారత కార్యదర్శి కరుమలైయన్ తెలిపారు. అందువల్లే కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఈ కోడ్స్‌‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్‌‌పై రెండు రోజుల వర్క్‌‌షాప్‌ విశాఖలోని ఏచూరి భవన్‌‌లో ఆదివారం ప్రారంభమైంది. ఈ వర్క్‌‌షాపులో ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్స్ లో సంఘం పెట్టుకునే హక్కును కఠినతరం చేశారని, కార్మికులు యాజమాన్యంతో బేరసారాలాడే హక్కును కోల్పోతారని వివరించారు. గతంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే సమ్మె సందర్భంగా 14 రోజులు ముందు నోటీసు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పుడు తప్పనిసరిగా ముందుగానే సమ్మె నోటీసులు ఇవ్వాలని లేబర్‌ ‌కోడ్స్‌‌లో పేర్కొన్నారని తెలిపారు. లేబర్ డిపార్టుమెంట్‌‌లో కన్సిలేషన్స్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి కార్మికులు సమ్మె చేయకూడదని, అలా సమ్మె చేస్తే యూనియన్‌‌ను రద్దు చేయవచ్చని, ఆ నాయకులను జైల్లో పెట్టవచ్చని మార్పులు చేశారని వివరించారు. కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు మూసివేయడానికి ప్రభుత్వ ముందస్తు అనుమతులు గతంలో మాదిరి అవసరం లేదని లేబర్‌ ‌కోడ్స్‌‌లో పేర్కొన్నారని తెలిపారు. లేబర్‌ ‌కోడ్స్‌ పరిధిలోకి కార్మికులందరూ వస్తారని ప్రభుత్వం తప్పుడు వాదన చేస్తోందన్నారు. కార్మిక చట్టాల మార్పు, ఈ లేబర్ కోడ్స్... యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలు కార్మికులను దోపిడీ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప, కార్మికుల జీవితాల్లో మార్పులు రావని పేర్కొన్నారు. మారిన పరిస్థితుల్లో కార్మికులను తమ చెప్పు చేతల్లో పెట్టుకునే విధంగా ఈ లేబర్ కోడ్స్ రూపొందించబడ్డాయన్నారు. వీటి రద్దు కోసం కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాడాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు యు.రామస్వామి అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌‌షాప్‌లో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం.శ్రీనివాస్‌, ఆర్‌‌కెఎస్‌‌వి.కుమార్‌, విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్ట్ అథారిటీ, బిహెచ్ఇఎల్, రక్షణ రంగం, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఎన్‌‌టిపిసి, రైల్వే తదితర రంగాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్