మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నకిలీ పత్రాలతో భూ కబ్జా..

1 రోజు క్రితం

land
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 12:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మాజీ స్పీకర్ సీతారాం సహా 13 మందిపై కేసు

- ఎనిమిది మంది అరెస్టు : 
శ్రీకాకుళం జిల్లా ఎస్‌‌పి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : భూమి అసలు యజమాని బతికి ఉండగానే, మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా తప్పుడు వారసత్వ పత్రాలు రూపొందించి సుమారు రూ.నాలుగు కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో సహా 13 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌‌పి కెవి.మహేశ్వర రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశామని చెప్పారు. తమ్మినేనితో పాటు ఐదుగురిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్‌‌పి తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... చాపురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 35/13లోని శ్రీ సత్యసాయి నగర్ లేఅవుట్‌లో 900 గజాల స్థలానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లను సేకరించిన నిందితులు, అసలు యజమానైన అంధవరపు గోవిందరాజులు బతికి ఉన్నా మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. దాని ఆధారంగా నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని తయారు చేశారు. అందులో అడబాల అలియాస్‌ అంధవరపు రజినిని ఏకైక వారసురాలిగా చూపించి ఆ స్థలాన్ని విక్రయించినట్లు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారు. ఆ స్థలానికి ప్రహరీ నిర్మించేందుకు నిందితులు ప్రయత్నించగా, అసలు యజమాని కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఈ కుట్రలో 13 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుత హిరమండలం సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేలా చూశారు. ఈ కేసులో అడబాల అలియాస్‌ అంధవరపు రజిని, తెలుగు సతీష్ కుమార్, సాలిపిల్లి లక్ష్మణరావు, ముదాడ్ల ఉపేంద్ర కుమార్, జెగురిపాటి ఉపేంద్రరావు, మామిడి గోపాలకృష్ణ, సాంబాన సాంబశివరావు, డాక్యుమెంట్ రైటర్ కూన పెద్దిరాజును పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ రబ్బరు స్టాంపులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తమ్మినేని వెంకట శ్రీరాములు చిరంజీవి నాగ అలియాస్‌ నాని, తమ్మినేని సీతారాం (మాజీ స్పీకర్), తమ్మినేని వాణి ఇతర నిందితులతో కుమ్మక్కై తప్పుడు, నకిలీ పత్రాలను సృష్టించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్‌‌పి తెలిపారు. చాకచక్యంగా ఈ కేసును ఛేదించిన ‌డిఎస్‌‌పి వివేకానంద, రూరల్ సిఐ పైడపునాయుడు, ఎస్ఐలు సురేష్, బాలరాజు, హరికృష్ణ, సిబ్బందిని ఆయన అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్