ప్రజాశక్తి-ఏలూరు : ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాలగూడెంకు చెందిన మాత్రపు సతీష్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును సతీష్ ద్విచక్ర వాహనంపై ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన కాలు తెగిపడింది. ప్రమాదంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన సతీష్‌ను 108 వాహనంలో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. సతీష్ ఆశ్రమ ఆస్పత్రిలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
ఏలూరులో రోడ్డు ప్రమాదం.. తెగిపడిన కాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)