మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్ 10, 11న విశాఖలో సాహిత్య సమ్మేళనం

2 రోజుల క్రితం

literature
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : తెలుగు సాహిత్యాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వర్ధమాన సాహితీవేత్తలకు వేదిక కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 10, 11 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే ‘సాహిత్య సమ్మేళనం–2026’ పోస్టర్‌ను ఆదివారం విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పలువురు సాహితీవేత్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఎస్.చలం, సాహిత్య ప్రస్థానం మేనేజర్ ఎంవిఎస్.శర్మ, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ ఇన్‌ఛార్జి జిఎస్.రాజేశ్వరరావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులపాటు ఈ సాహిత్య సమ్మేళనం జరగనుందన్నారు. కథ, కవిత్వం, విమర్శ తదితర సాహిత్య ప్రక్రియలపై ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగించడంతో పాటు, సమకాలీన సాహిత్య ధోరణులు, సాహిత్యంలో వస్తోన్న మార్పులు, కొత్త తరం రచయితలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చలు జరగనున్నామని తెలిపారు. వర్ధమాన సాహితీవేత్తలతో ఇష్టాగోష్టి, సాహిత్య చర్చలు, ప్రసంగాలు ఈ సమ్మేళనంలో ప్రధానంగా ఉంటాయన్నారు యువ రచయితలు, కవులు తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకునేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందన్నారు. ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల సాహిత్యాభిమానులు, రచయితలు, కవులు, విద్యార్థులు, వర్ధమాన సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమ్మేళనాన్ని సాహితీ స్రవంతి, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. పాల్గొన దలచిన వారు రిజిస్ట్రేషన్ రుసుము రూ.100 చెల్లించి నిర్వాహకుల వాట్సాప్ నెంబర్లకుగానీ, sahithisammelanamvizag@gmail.com కుగానీ వారి వివరాలు పంపించాలని కోరారు. వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రముఖ కవులు పాయల మురళీకృష్ణ, జివిఎస్.జయపాల్ రావు, రచయిత ఈరదాసు తిరుపతిరాజు, సాహితీ స్రవంతి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.ఫ్రాన్సిస్, ఉపాధ్యక్షులు కె.సంతోషం, పాత్రికేయులు డి.రవికుమార్, కోరాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్