ప్రజాశక్తి-దత్తిరాజేరు : దత్తిరాజేరు మండలం షికారు గంజి రోడ్డు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు బాడంగి మండలం గజరాయునివలసకు చెందిన వారిగా గుర్తించారు. వారు తెర్లి ఆదినారాయణ, గునుపూరు తిరుపతిగా తెలిసింది. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దత్తిరాజేరు మండలంలో లారీ–ఆటో ఢీ.. ముగ్గురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 07:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)