వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి
ఏ స్థాయి నుంచి వచ్చావో తెలుసుకో
వైసిపి జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పార్టీ వ్యతిరేక పార్టీ కార్యక్రమాలు చేపట్టడం వలనే పార్టీ నుంచి మాజీ నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని ఇదే విషయం ఆయనకు తెలుసునని, ఏ స్థాయి నుంచి ఎమ్మెల్యే గా అయ్యే స్థాయికి ఎలా వచ్చావో తెలుసుకోవాలని వైసిపి జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ బడుకొండ అప్పలనాయుడు ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆదివారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .... నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరెడ్డి కుటుంబాన్ని విమర్శించడం హాస్యాస్పదం గా ఉందన్నారు. ఏడాది నుంచి నన్ను తొలగిస్తామన్నారు అని మాతో చాలా సార్లు చెప్పడం జరిగిందనీ అన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఆయనచేతలు,మాటలు వలన వైసీపీకి నష్టం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసునన్నారు. నోటీసులు ఇవ్వలేదు, పార్టీలో క్రమ శిక్షణా ఉందా లేదా అనేది అనడం హాస్య స్పందంగా ఉందన్నారు. మీరు ఒంటెద్ది పోకడలతో వెళ్తున్నారు కాబట్టే మిమ్మల్ని పక్కన బెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి జెడ్పీ చైర్మన్,ఎమ్మెల్యేగా చేసిన విషయం తెలుసుకోవాలన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న సాంబశివరాజు కొడుకు సురేష్బాబు ను 2019 లో తప్పించి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. కిందిస్థాయి వారికి ఇంచార్జ్ ఇచ్చారు నేను పని చేయలేను అని చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబు ఉద్దండుడు, నేర్పరి అనడం,ఆయన అవకాశ రాజకీయ ధోరణికి నిదర్శనమన్నారు. ఆయనకు ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి వెళిపోవాలని ఉంది కాబట్టి పార్టీ కార్యక్రమాలను ఏడాది కాలం నుంచి అంటి ముట్టనట్లు వ్యవహరించారన్నారు. వైసిపి నుంచి సస్పెండ్ చేశారని వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం సరికాదన్నారు. మేము ఎప్పుడూవ్యక్తిగతంగా,కుటుంబం గురించి విమర్శించలేదన్నారు. మీరు జగన్మోహనరెడ్డి మీద నువ్వు నువ్వు అని సంబంధించి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తిరుపతి దర్శనం విషయంలో సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి మీద విమర్శించడం సరికాదన్నారు. మీరు తిరుపతి దర్శనాలు కోసం ఎలాఉపయోగించుకున్నారు .ఒక సారి గుర్తు చేసుకోవాలన్నారు. డీఎస్సీ పరీక్ష మీద సీబీఐ విచారణ జరిపితే లోకేష్ జైలు కి వెళ్ళడం ఖాయమన్న విషయం బడుకొండ తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశంలోకి వెళతారు గనుక అశోక్ గజపతి రాజు ను పొగుడుతున్నారన్నారు. జగన్మోహనరెడ్డి కొంతమంది చెంచాలు మాటలు వింటున్నారన్నారు అన్నారు మరి మీ బావగారూ జగన్మోహనరెడ్డికి చెంచగా వ్యవరించరా అని ప్రశ్నించారు. వైసిపి ఆదేశాలు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. మీరు వైసిపి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించకపోవడం వలన మిమ్మల్ని తప్పించడం జరిగిందన్నారు. మీ వెంట ఎంతమంది వస్తారో.వేచి చూడండి అంటూ చురక అంటించారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినపుడు జగమైహనరెడ్డి మీకు డబ్బులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. జిల్లాలో జెడ్పీ చైర్మన్ గా మజ్జి శ్రీనివాసరావు కి అవకాశం కల్పించారు, చిన్న శ్రీను ఎలా వచ్చారు, ఎక్కడ నుంచి వచ్చారు, అయనేమీ రాజకీయా నాయకుడా అని ప్రశ్నించారు. వైసిపి లోకి అధికారాన్ని మా అందరికంటే ఎక్కువ అనుభవించారనీ చిన్న శ్రీను ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు మాట్లాడుతూ బడుకొండ అప్పలనాయుడు ప్రజా.వ్యతిరేక పరిపాలన వలన ఓడిపోయాము అన్నారు అటువంటప్పుడు రెండో సారి ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారని ప్రశ్నించారు. మేము పార్టీలో 2010 లో పార్టీలో చేరి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేసన్నారన్నారు. అయిన 2019లో మేము టికెట్ ఇవ్వకపోయినా మేము విమర్శించలేదన్నారు. ఎవరు కుటుంబం బాగు పడిందో తెలుసుకోవాలన్నారు. డబ్బులు ఉన్న వారికి టికెట్. ఇస్తారని అనడం సరికాదన్నారు. నాకు ఎమ్మెల్సీ, బంగారమ్మ కు ఆర్టీసీ చైర్మన్ గా, రేగాన శ్రీనివాసరావు కి పదవులు ఇచ్చారు మేము ఏమైనా డబ్బులు ఇవ్వలేదు మరి మాకు పదవులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మా కంటే మీ కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. కార్యకర్తలకు వైసీపీలోనే అధిక ప్రాధాన్యత ఉండడానికి మేము అనుభవిస్తున్న పదవులు కారణమన్నారు. తప్పుడు మాటలు మాట్లాడటం బడుకొండ అప్పలనాయుడు మాట్లాడటంసరికాదన్నారు. జగన్మోహనరెడ్డి కి ఉన్న ప్రజాదరణ ఎవరికి లేదన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అన్నారు చౌకబారు విమర్శలు బడుకొండ అప్పలనాయుడు మానుకోవాలన్నారు. నెల్లిమర్ల నియోజవర్గ ఇంచార్జీ సన్నీ మాట్లాడుతూ నాకు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించిన జగన్మోహనరెడ్డి కి ,బొత్స సత్యనారాయణ,జిల్లా నాయకులను అభినందనలు తెలిపారు. నియోజకవర్గం లో ,జిల్లా నాయకులు సహకారంతో రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు మాటలు ఆయనేంటి ఆయన విధానం, జగన్మోహనరెడ్డి మీద ఆయనకున్న అభిప్రాయం ఆయన బెట్టుకున్నారన్నారు. 14 తేదీన నాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి కలవడం జరిగిందన్నారు. అదే రోజు నేను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేను అని నాతో చెప్పడం జరిగిందన్నారు. నా విషయంలో మాట్లాడుతూ నా దగ్గర పని చేసిన వాడితో నేను పని చేయాలా అని అనడం సరికాదన్నారు. మేము ఎవరు కింద పని చేయలేదు ఇంచార్జ నాయకత్వంలో పని చేసాము తప్ప మీ కింద పని చేయలేదన్నారు. మేము వైసిపి పార్టీ పుట్టినప్పటి నుంచి పని చేసిన వ్యక్తులమన్నారు. మేము జీవితాంతం జగనకోహనరెడ్డి నాయకత్వంలో పని చేస్తామన్నారు. కింద పడేసిన పేపర్ అనడం సరికాదన్నారు. మేము వ్యక్తిగతంగా విమర్శలు చేయగలమని హెచ్చరించారు. మీరు ఎమ్మెల్యేగా గెలిచారు అంటే సాంబశివరాజు చేసిన కృషిని,త్యాగాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో అర్ధం చేసుకుని వ్యవహరించాలని కోరారు. విలేకర్ల సమావేశంలో పార్టీ నాయకులు పతివాడ సత్యనారాయణ, రేగాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)