ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలోని చెముడులంకలో ఆదివారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. స్థానిక నాలుగు వీధుల కూడలిలో కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కమిటీ, గ్రామస్తుల సహకారంతో పిండి వంటలతో విందు భోజనాన్ని తలపించేలా ఈ అన్నసమారాధనను ఘనంగా ఏర్పాటు చేశారు. ఇందులో చెముడులంకతో పాటుగా పరిసర ప్రాంతాల నుంచి సుమారు ఆరు వేల మంది వరకు విచ్చేసి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
చెముడులంకలో భారీ అన్నసమారాధన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)