రోగులకు వైద్య పరీక్షలు ఉచితంగా మందుల పంపిణీ
గ్రామ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మెగా వైద్య శిబిరం
శంకర్ వంశం బలరామ జనాదేవ్,
వేపాడ (విజయనగరం) : వేపాడ మండలం చినగుడిపాల గ్రామంలో శంకర్ వంశం బలరామ జనాదేవ్, శ్రీమతి సురేష్వరి సహకారంతో గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త నమూనాలను సేకరించారు. అలాగే రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించే దిశగా వైద్యులు సేవలందించారు. సాధారణ వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.కె.డి. డేనియల్ (జనరల్ మెడిసిన్), డాక్టర్ సత్య వంశీ (ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు), డాక్టర్ భార్గవి పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)