ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టణంలోని మూడు నాలుగు వార్డులలో గడపగడపకు వైసిపి

2 గంటల క్రితం

YSRCP is in power in three or four wards of the town.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 01:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడడంతో గడపగడపకు వైసిపి ప్రచారాన్ని పార్టీ నాయకులు ముమ్మరం చేశారు.రామచంద్రపురం పట్టణంలో గల 3, 4 వార్డుల లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ , వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లిసూర్యప్రకాష్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్న నాయకులు, ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వార్డు ల అభివృద్ధికి మరింత ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, మాజీ ఎంపీపీ అంబటి భవాని, వైసీపీ మహిళా విభాగం నాయకులు ఎల్లమెల్లి సతీష్ కుమారి, వాడ్రేవు సాయి ప్రసాద్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్