రూపాయికే సిమ్, ఉచిత కాల్స్!
సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఆఫర్లు
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే 'ఫ్రీడమ్ ప్లాన్'ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ కింద ఉచిత సిమ్ కార్డుతో పాటు, 24 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తాయి. ఈ ఆఫర్ కేవలం కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వారికి మాత్రమే. ప్రస్తుత వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఈ పరిమిత కాల ఆఫర్ 2026 సెప్టెంబర్ 12 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
అలాగే బీఎస్ఎన్ఎల్ తన రూ. 2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 మధ్య ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వారికి 47 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో మొత్తం వ్యాలిడిటీ 412 (365+47) రోజులకు పెరుగుతుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయి. తమ 4జీ నెట్‌వర్క్‌లోకి కొత్త వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఆఫర్లను ప్రకటించినట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.







కామెంట్‌లు (0)