
బుట్టాయగూడెం మండలంలో ప్రశాంతంగా బంద్

ఏజెన్సీ బంద్‌కు మద్దతుగా అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో గిరిజనులు ర్యాలీ, ధర్నా

అరకులో మేము సైతం అంటూ బందులో పాల్గొన్న ఆదివాసి చిన్నారులు

అనంతగిరిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్..

చింతూరు మండల కేంద్రంలో బంద్‌లో పాల్గొన్న ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు

హుకుంపేట ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో మన్యం బంద్

నిర్మానుష్యంగా వారపు సంత.. స్తంభించిన రాకపోకలు
ముంచంగిపుట్టు:ఆదివాసీ గిరిజన సంఘాల పిలుపు మేరకు శనివారం ముంచంగిపుట్టు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మన్యం బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. బంద్ ప్రభావంతో శనివారం జరిగే వారపు సంత నిర్మానుష్యంగా మారింది.
ప్రజల రాకపోకలు పూర్తిగా తగ్గిపోవడంతో పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాధారణంగా జనసందోహంతో సందడిగా ఉండే వారపు సంత ప్రాంతం బోసిపోయింది. బంద్‌కు ప్రజలు, వివిధ వర్గాల వారు మద్దతు తెలపడంతో మండల కేంద్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.

బంద్ ఆటో డ్రైవర్ల స్వచ్ఛంద మద్దతు.. నిర్మానుష్యంగా ప్రధాన రహదారులు
కురుపాం: ఆదివాసీ గిరిజన సంఘాల పిలుపు మేరకు శనివారం నిర్వహించిన మన్యం బంద్ కురుపాంలో ప్రభావం చూపింది. బంద్‌కు ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి తమ ఆటోలను నిలిపివేశారు. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు బోసిపోయి నిర్మానుష్యంగా కనిపించాయి. బంద్ ప్రభావంతో సాధారణ రోజులతో పోలిస్తే కురుపాంలో జనసంచారం గణనీయంగా తగ్గింది. ఆదివాసీ గిరిజన సంఘాల పిలుపునకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభించడంతో కురుపాంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

డుంబ్రిగూడ మండల కేంద్రంలో బంద్ లో పాల్గొన్న ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు
వి.ఆర్ పురం మండల కేంద్ర రేఖ పల్లిలో ఆదివాసి గిరిజనసంఘం ఆధ్వర్యంలో నిరసన

సీతంపేట: ఆదివాసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సీతంపేట ఏజెన్సీలో మన్యం బంద్ కొనసాగుతోంది. జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయంగా తక్షణమే కొత్త చట్టం తీసుకురావాలని, 1/70 చట్టం పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు బంద్‌ను ప్రారంభించారు. బంద్ నేపథ్యంలో సీతంపేట ఏజెన్సీలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో జనజీవనం ప్రభావితమైంది. ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. లక్ష్మణరావు, భాస్కర్‌రావు, సాంబయ్య, మండల కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

బస్సులను అడ్డుకుంటున్న ఆందోళనకారులు
పెదబయలు మండల కేంద్రం విజయవంతంగా బంద్

ముంచంగిపుట్టు మండలంలో పోలీసుల బందోబస్తు మధ్య బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లు, రహదారుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

పాడేరులో వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో పాడేరు పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
గుమ్మలక్ష్మీపురంలో మూతపడ్డ వర్తక, వాణిజ్య సముదాయాలు
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం చేపట్టిన మన్యం బంద్ శనివారం కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో గుమ్మలక్ష్మీపురంలో వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. దీంతో ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో సాధారణ జనజీవనం ప్రభావితమైంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జిఒ నెంబర్ 3 రద్దయిన విషయం తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా కొత్త జిఒ తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా హామీ అమలు కాకపోవడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్ చేపట్టారు. ఆదివాసీల హక్కులను పరిరక్షించడంతోపాటు జిఒ నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా తక్షణమే కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.







కామెంట్‌లు (0)