- ధర్నా చౌక్ లో ధర్నా
ప్రజాశక్తి - విజయవాడ: నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను యథాతధంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ రిప్రజెంటేటివ్స్ స్థానిక ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. ఈ ధర్నాను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లలో సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల ప్రస్తావన లేకపోవడం దారుణమని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకటరావు మాట్లాడుతూ సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు ఉన్న పాత చట్టాలను కొత్త లేబర్ కోడ్ లలో పొందు పరచాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల హక్కులను చట్ట ప్రకారం రక్షించాలని, సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల కోసం ప్రత్యేక పని పద్ధతులు కల్పించాలని, ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ ను సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు వర్తింప చేయకూడదని, ప్రభుత్వ ఆసుపత్రులలో మెడికల్ రిప్రజెంటేటివ్ ల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు, ఎంవి ఆంజనేయులు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు అజయ్ కుమార్, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సిహెచ్ కుమార్ అధ్యక్షతన వహించారు.






కామెంట్‌లు (0)