బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో భేటి

1 గంట క్రితం

anagani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి అనగాని సత్యప్రసాద్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘ నేతలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రిని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జెఎసి చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాటకొండ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ కలిసి వినతి పత్రాన్ని బుధవారం అందించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు ఉద్యోగుల సమస్యలను వివరించారు. రెవెన్యూ ఉద్యోగులతో వెంటనే చర్చించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. విఆర్‌ఎ, విఆర్‌ఒ, సర్వేర్లు, రెవెన్యూ శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే అనేకసార్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చామన్నారు. గతంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించలేదన్నారు.

వెంటనే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డిఎలు, ఐఆర్, పిఆర్సికి సంబంధించిన విషయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. మంత్రి అనగాని స్పందిస్తూ.. రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, ఉద్యోగులుకు ఇవ్వవలసిన పెండింగ్ డిఎలు, ఐఆర్, పిఆర్ సి కమిషన్‌కు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులతో సానుకూల చర్చలు జరిపి న్యాయం చేస్తామని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్