గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మిలాద్‌-ఉన్‌-నబీ సెలవు తేదీ మార్పు

1 గంట క్రితం

miladi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 01:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉత్తర్వులు జారీ

అమరావతి : మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని గతంలో ప్రకటించిన ఆగస్టు 25, 2026 (మంగళవారం) సెలవును ఆగస్టు 26, 2026 (బుధవారం)కు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (పొలిటికల్‌-బి) శాఖ జి.ఓ.ఆర్‌.టి. నం.1675, తేదీ: 20-08-2026 జారీ చేసింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 కింద ఈ ఏడాది ప్రకటించిన మిలాద్‌-ఉన్‌-నబీ సెలవు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించింది.

గతంలో ప్రకటించిన ఆగస్టు 25, 2026 (మంగళవారం) సెలవును ఆగస్టు 26, 2026 (బుధవారం)కు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (పొలిటికల్‌-బి) శాఖ జి.ఓ.ఆర్‌.టి. నం.1675, తేదీ: 20-08-2026 జారీ చేసింది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జి.ఓ.ఆర్‌.టి. నం.2277, తేదీ: 04-12-2025 ద్వారా మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా ఆగస్టు 25, 2026ను సెలవుగా ప్రకటించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి సమర్పించిన నివేదిక ప్రకారం, రబీ ఉల్ అవ్వల్ మాసపు చంద్రదర్శనం 12-08-2026న జరగలేదని, చంద్రదర్శనం ఆధారిత (Lunar Calendar) లెక్కల ప్రకారం రబీ ఉల్ అవ్వల్ 12వ తేదీ అయిన మిలాద్‌-ఉన్‌-నబీ ఆగస్టు 26, 2026 (బుధవారం) నాడు వస్తుందని వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి నివేదించింది.

వక్ఫ్ బోర్డు సమర్పించిన అభ్యర్థనను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించిన అనంతరం, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 కింద మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా ప్రకటించిన సెలవును ఆగస్టు 25 నుంచి ఆగస్టు 26, 2026కు మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసాధారణ గెజిట్‌లో సవరణ నోటిఫికేషన్‌ను ప్రచురించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్