ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : ఓ గ్రానైట్ యజమాని నుంచి రూ.రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా మైనింగ్ శాఖ డిడిఎస్‌ఎంస్ యు.శివశంకర్‌ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చీమకుర్తి, బల్లికురవ గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు, అక్రమ వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. చీమకుర్తిలోని వాసవి గ్రానైట్‌లో సుమారు మూడు నెలల క్రితం ఒడిశాకు చెందిన యాదవ్ అనే కార్మికుడు క్వారీ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. మృతుని కుటుంబానికి అందాల్సిన పరిహారం సక్రమంగా అందలేదని, క్వారీలో అక్రమాలు జరుగుతున్నాయని, బాధిత కుటుంబ సభ్యులు సిబిఐకి ఫిర్యాదు చేశారు. దీంతో, సిబిఐ అధికారులు జిల్లాలో క్వారీలను తనిఖీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వాసవి, గోల్డెన్ గ్రానైట్ క్వారీల యజమానులతో ఒంగోలులోని కెబి రెస్టారెంట్‌లో ‘సెటిల్‌మెంట్’ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలొచ్చాయి. క్వారీ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందిన కేసును సర్దుబాటు చేసేందుకు రూ.రెండు లక్షలు తీసుకుంటుండగా సిబిఐ అధికారులు శివశంకర్‌ను పట్టుకున్నారు. డిడిఎంఎస్ శివశంకర్‌తో పాటు గ్రానైట్ యజమాని సిద్ధా సురేష్, ఫణి, సర్వేయర్, అసిస్టెంట్ సర్వేయర్‌తో పాటు మరో వ్యక్తిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఒంగోలులో విచారించారు. అనంతరం సిబిఐ కోర్టులో హాజరుపరిచేందుకు విజయవాడకు తరలించినట్లు సమాచారం. ఓ బ్యాంకు మేనేజర్ పేరు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లు తెలిసింది.
Print Editionసిబిఐకి చిక్కిన మైనింగ్ డిడిఎంఎస్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)