అమరావతి : మన ఇల్లు - మన లోకేష్ పేరుతో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. మంగళవారం మంగళగిరి నియోజకవర్గంలో 3 వేలమందికి మంత్రి లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ... నిరుపేదలకు రూ.1000 కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శాశ్వత భూ పట్టాతో పేదల ఆస్తిని ఎవ్వరూ కదిలించలేరన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళుతున్నామన్నారు. 2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినపుడు.. తన తండ్రి చంద్రబాబును కూడా కొందరు అవహేళన చేశారని గుర్తుచేసుకున్న మంత్రి ... ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నానన్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తానని మంత్రి లోకేష్ ఛాలెంజ్ చేశారు. ఇప్పటికే డ్రైనేజీ పనులు చేపట్టామని, త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని మంత్రి వెల్లడించారు.
3 వేలమందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి లోకేష్
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 11:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)