- గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఎఎన్‌యు) గోల్డెన్ జూబ్లీ వేడుకలను సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. స్వర్ణోత్సవ వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందించిన పోస్టల్ స్టాంప్ ను గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఎఎన్‌యు ఉపకులపతి కే గంగాధర రావు, రెక్టార్ ఆర్.శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ జి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)